పూజిత పొన్నాడ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందా?


పూజిత పొన్నాడ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందా?
పూజిత పొన్నాడ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందా? ( Courtesy: Instagram )

పూజిత పొన్నాడ‌.. క్రేజీ హీరోయిన్‌కు ఏమాత్రం త‌గ్గ‌ని అందం ఆమె సొంతం. గ్లామ‌ర్‌తో క‌ట్టిప‌డేసే ఈ చిన్నది త‌న అర్హ‌త‌కు త‌గ్గ అవ‌కాశాల్ని ఇప్ప‌టి వ‌ర‌కు పొంద‌లేక‌పోయింది. చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌ని నిరూపించే ఆఫ‌ర్ కోసం ఎదురుచూస్తోంది. తెలుగ‌మ్మాయి అయిన ఈ పూజిత‌కు తాజాగా ఓ గోల్డెన్ ఛాన్స్ త‌లుపు త‌ట్టింది. వేర్ ఈజ్ ద వెంక‌టల‌క్ష్మి లో రాయ్ ల‌క్ష్మిని డామినేట్ చేస్తూ హాట్ హాట్‌గా న‌టించింది.

ద‌ర్శ‌కుడు, క‌ల్కి, సెవెన్‌, బ్రాండ్ బాబు చిత్రాల్లోనూ మెరిసింది. కానీ ఫ‌లితం శూన్యం, రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన `రంగ స్థ‌లం`లో ఆది పినిశెట్టి ప్రేయ‌సిగా ప్ర‌కాష్‌రాజ్ కూతురిగా కీల‌క పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకుంది. ఇంత కాలం చిన్న చిన్న పాత్ర‌ల‌తో స‌రిపెట్టుకుంటూ వచ్చిన పూజిత పొన్నాడ‌కు తాజాగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో లెగ్ షేక్ చేసే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న‌ట్టు తెలిసింది.

క్రిష్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గ‌జ‌దొంగగా క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఏం.ఎం.ర‌త్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ ఐట‌మ్ సాంగ్ వుంద‌ట‌. ఆ పాట కోసం పూజిత పొన్నాడ‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ సెలెక్ట్ చేసిన‌ట్టు తెలిసింది. 19వ శ‌తాబ్దం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.