పోలీసులను ఆశ్రయించిన పూనం


హీరోయిన్ పూనం కౌర్ పోలీసులను ఆశ్రయించింది . తనపై లేని పోనీ కథనాలు అల్లి తన పరువు ,ప్రతిష్టలను దెబ్బ తీస్తున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటూ ఫిర్యాదు చేసింది . అంతేకాదు కొన్ని యూట్యూబ్ లింక్ లను కూడా ఉదాహరించింది . వాటి తాలూకు ఫుటేజ్ ని కూడా పోలీసులకు అందజేసింది పూనం కౌర్ . టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన పూనం కౌర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది .

అయితే పవన్ కళ్యాణ్ వల్ల ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యింది . దాంతో ఆమెపై రకరకాల కథనాలు అల్లుతూ యూట్యూబ్ లో పోస్ట్ చేసారు కొంతమంది . నిరాధారమైన ఆరోపణలతో కట్టుకథలతో నా పరువు మంటగలిపారు కాబట్టి వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది . మరి దర్యాప్తు లో ఏమని తేలుతుందో ? ఎలాంటి చర్యలు తీసుకుంటారో ?