సెక్స్ రాకెట్ పై స్పందించిన పూనమ్ కౌర్


poonam kaur comments on tollywood sex rocket టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్ ఎట్టకేలకు స్పందించింది . అమెరికాలో సెక్స్ రాకెట్ నడుపుతున్న కిషన్ మోదుగుమూడి – చంద్ర దంపతులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కి గురయ్యింది . అలాగే వివాదాస్పద నటి శ్రీ రెడ్డి అమెరికా సెక్స్ రాకెట్ లో ఉన్న హీరోయిన్ ల పేర్లు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే , దాంతో ఎట్టకేలకు స్పందించింది పూనమ్ కౌర్ . శ్రీ రెడ్డి తన పేరుని లీక్ చేయడం పై లోలోన కోపంగా ఉన్న ఈ భామ ఆ లీక్ విషయం పై పెద్దగా మాట్లాడలేదు కానీ సెక్స్ రాకెట్ తో మాత్రం తనకు సంబంధం లేదని అంటోంది .

అమెరికాలోని చికాగో లో టాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయిన విషయం తెలిసిందే . కిషన్ మోదుగుమూడి , చంద్ర దంపతులు అసలు నిజమైన భార్యాభర్తలు కాదని కేవలం లగ్జరీ లైఫ్ ని అనుభవించడానికి మాత్రమే భార్యాభర్తలుగా చెలామణి అవుతున్నారు . టాలీవుడ్ నుండి పలువురిని అమెరికా పిలిపించి డబ్బు ఆశ చూపించి , లేదంటే వీసాలతో బెదిరించి వ్యభిచారం చేయిస్తున్నారని …… నన్ను కూడా అలాగే చేయించాలని చూసారని అర్ధరాత్రి తన రూమ్ కి ఒకరిని పంపించి లోబరుచుకోవాలని చూసారని కానీ నేను వచ్చిన వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి మరీ పంపించానని ట్వీట్ చేసింది పూనమ్ కౌర్ .

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు పెద్దగా స్టార్ డం రాలేదు దాంతో చిన్న చిన్న వేషాలు వేసింది ఇక ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది . పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో బ్రాండ్ అంబాసిడర్ అయ్యింది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కానీ దర్శకులు త్రివిక్రమ్ తో కానీ అంతగా పొసగడం లేదు ఈ భామకు .

English Title: poonam kaur comments on tollywood sex rocket