ఫ్యాన్స్‌ని బ్లేమ్ చేయ‌కండి – పూన‌మ్ కౌర్‌

ఫ్యాన్స్‌ని బ్లేమ్ చేయ‌కండి - పూన‌మ్ కౌర్‌
ఫ్యాన్స్‌ని బ్లేమ్ చేయ‌కండి – పూన‌మ్ కౌర్‌

మీరాచోప్రా , ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌ధ్య ఆన్ లైన్ వారు రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న‌టికి నిన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి, క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు ఫిర్యాదు చేసి ఈ వివాదాన్ని మీరా మ‌రింత జ‌ఠిలంగా మారుస్తున్న విష‌యం తెలిసిందే. ఏపీ ప్ర‌భుత్వాన్ని కూడా క‌ల‌గ‌జేసుకోవాలంటూ కూడా ఫిర్యాదు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా వుంటే ఈ వివాదంపై పూన‌మ్ కౌర్ కూడా స్పందించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

గ‌తంలో పూన‌మ్ కౌర్‌ని స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్ ఆన్ లైన్ వేదిక‌గా ట్రోల్ చేయ‌డం, వారిపై పూన‌మ్ సైబ‌రాబాద్ పోలీసుల్ని సంప్ర‌దించి కంప్లైంట్ ఇవ్వ‌డం తెలిసిందే. అయితే విచిత్రం ఏంటంటే ఈ వివాదంలో ఫ్యాన్స్‌ని బ్లేమ్ చేయ‌కండ‌ని పూన‌మ్ చెప్ప‌డ‌మే ఇక్క‌డ ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. ఫ్యాన్స్ అమాయ‌కుల‌ని, వారిని కొంత మంతి సొంత లాభం కోసం వాడుకుంటున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

`ఎటువంటి కారణం లేకుండా నా పేరు వివాదంలోకి లాగ‌బ‌డినా ఇప్ప‌టి వ‌ర‌కు నేను అభిమానుల‌పై ఏ విష‌యంలోనూ ఫిర్యాదు చేయ‌లేదు. వారు అమాయ‌కుల‌ని బ‌లంగా న‌మ్ముతాను. మ‌ధ్య‌త‌ర‌గ‌తికి చెందిన అమాయ‌కుల్ని కొంత మంది త‌మ స్వ‌లాభం కోసం ప్రేరేపిస్తున్నారు. గ‌తంలో న‌న్ను బాధ‌పెట్టిన వ్య‌క్తుల‌పై మాత్ర‌మే ఫ‌ర్యాదు చేశాను. అన‌వ‌స‌ర‌మైన వివాదాల్లో అభిమానుల్ని నిందించ‌కండి` అని పూన‌మ్ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం సామాజిక మాథ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.