దొరసాని కలెక్షన్స్ పూర్ !


Poor collections for Dorasani
Poor collections for Dorasani

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తూ పరిచయమైన చిత్రం దొరసాని . శివాత్మిక హీరోయిన్ గా నటించిన ఈ దొరసాని జూలై 12 న విడుదల అయ్యింది . అయితే ఈ సినిమా కలెక్షన్స్ చాలా పూర్ గా ఉన్నాయి . ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు సరికదా ! ఓ మోస్తారు వసూళ్లు కూడా రావడం లేదు దాంతో చిత్ర బృందం షాక్ అవుతోంది .

తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది . స్లో నెరేషన్ అనిపించినప్పటికీ సినిమా బాగానే ఉంది కానీ ఈ సినిమాని చూడటానికి ప్రేక్షకులు అంతగా ఉత్సాహం చూపించడం లేదు దాంతో దొరసాని థియేటర్ లు వెలవెలబోతున్నాయి . ఆనంద్ దేవరకొండ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ అవి నెరవేరేలా కనిపించడం లేదు పాపం .