దారుణమైన కలెక్షన్లు హతవిధీ !


Poor collections for NTR Mahanayakudu

ఎన్టీఆర్ మహానాయకుడు నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయినా విషయం తెలిసిందే , అయితే ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావడం వల్ల కావచ్చు లేక మరో కారణం వల్ల కావచ్చు ఎన్టీఆర్ మహానాయకుడు పై పెద్దగా ప్రభావం లేకుండాపోయింది . నిన్న విడుదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ దారుణంగా వచ్చాయి దాంతో ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుందా ? అన్న భయం మొదలైంది . ఎన్టీఆర్ బయోపిక్ అంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని అనుకున్నారు .

 

కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఎన్టీఆర్ కథానాయకుడు ప్లాప్ కాగా నిన్న రిలీజ్ అయిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి కూడా ఓపెనింగ్స్ లభించలేదు దానికి తోడు చంద్రబాబు నాయుడు ని హీరోలా చూపించారు దాంతో తెలుగుదేశం శ్రేణులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు ఔరా ! అంటూ . మొత్తానికి ఈ ఎన్టీఆర్ మహానాయకుడు అనే సినిమా చంద్రబాబు మహానాయకుడు అనేలా ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారు . బాలయ్య సినిమాకు మంచి ఓపెనింగ్స్  ఉంటాయి అయితే విచిత్రం ఏంటో ఎన్టీఆర్ బయోపిక్ కు ఎన్టీఆర్ ఆశీస్సులు లేవనుకుంటా !

 

English Title: Poor collections for NTR Mahanayakudu