శ్రీనివాస కళ్యాణం కలెక్షన్లు అంత దారుణమా


poor collections for srinivasa kalyanamనితిన్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన శ్రీనివాస కళ్యాణం ఆగస్టు 9న విడుదలైన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా విడుదలకు ముందు దిల్ రాజు గొప్పలు చెప్పాడు , శ్రీనివాస కళ్యాణం కనీవినీ ఎరుగని చరిత్ర సృష్టించబోతోంది అని కానీ తీరా విడుదలయ్యాక చూస్తే పరిస్థితి తారుమారయ్యింది . కలెక్షన్లు మరీ నాసిరకంగా ఉన్నాయి . మొదటి రోజున ఈ సినిమా ఎంత వసూల్ చేసిందో తెలుసా ……. కేవలం 2 కోట్ల 70 లక్షల వసూళ్లు మాత్రమే ! దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు ఉంటాయి అయితే ఆ అంచనాలను అందుకోవడంలో శ్రీనివాస కళ్యాణం ఘోరంగా విఫలమయ్యింది దాంతో వసూళ్లు మందగించాయి .

ఇక నితిన్ కు కూడా కొంతకాలంగా కాలం కలిసి రావడం లేదు పాపం చేస్తున్న సినిమాలన్నీ వరుసగా ఫ్లోప్ అవుతున్నాయి అయితే ఇది కాస్త గుడ్డిలో మెల్ల అన్నమాట ! అటు హిట్ కాదు ఇటు ఫ్లాప్ కాదు యావరేజ్ చిత్రంగా నిలిచింది శ్రీనివాస కళ్యాణం . దిల్ రాజు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . తప్పకుండా బొమ్మరిల్లు , శతమానం భవతి లాంటి చిత్రాల్లా శ్రీనివాస కల్యాణం కూడా పెద్ద హిట్ అవుతుందని ల్యాండ్ మార్క్ అవుతుందని అనుకున్నాడు కట్ చేస్తే వసూళ్లు లేకుండా పోయాయి . మొదటి రోజున 2. 77 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది శ్రీనివాస కళ్యాణం . నిన్న పెద్దగా కలెక్షన్లు లేకుండా పోయాయి ఈ సినిమాకు . ఈరోజు రేపటితో అసలు విషయం తేలిపోతుంది .

English Title: poor collections for srinivasa kalyanam