స్టార్ హీరోకు ఇంత దారుణమైన కలెక్షన్ లా ?


Poor collections for Shahrukh khan's ZERO
Shahrukh khan

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ అంటే ఒకప్పుడు బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన హీరో , పైగా బాలీవుడ్ ఖాన్ త్రయం లలో ఇప్పటికి కూడా స్టార్ గా కొనసాగుతున్నాడు కూడా . అయితే గతకొంత కాలంగా షారుఖ్ ఖాన్ కు సాలిడ్ హిట్ లేదు దాంతో తాజా చిత్రం ” జీరో ” పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు . అయితే ఈ సినిమా కూడా షారుఖ్ ని దారుణంగా దెబ్బకొట్టింది . డిసెంబర్ 21న విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలుసా …….. 20 కోట్లు మాత్రమే .

షారుఖ్ ఇమేజ్ పడిపోయింది అనడానికి ఈ వసూళ్లు సాక్ష్యంగా నిలిచాయి . షారుఖ్ తో పాటుగా కత్రినా కైఫ్ , అనుష్క శర్మ కూడా నటించింది జీరో చిత్రంలో . ఈ సినిమాపై షారుఖ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ అతడి ఆశలన్నీ అడియాసలు అయ్యాయి . మొదటి రోజున 20 కోట్లకు పైగా వసూళ్లు రాగా నిన్న 15 కోట్ల పైన వచ్చినట్లు తెలుస్తోంది అంటే ఈరోజు ఆదివారం కాబట్టి మొత్తంగా 50 కోట్ల క్లబ్ లో చేరితే గొప్పే అని తెలుస్తోంది . అయితే ఆదివారం కాబట్టి ఆ వసూళ్లు ఇంకాస్త పెరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . అయితే షారుఖ్ కు ఇంతటి దారుణమైన కలెక్షన్స్ రావడం ఏంటి ? అని షాక్ అవుతున్నారు . ఇక షారుఖ్ మార్కెట్ పడిపోయినట్లే అని అంటున్నారు .

English Title: Poor collections for Shahrukh khan’s ZERO