విజయ్ దేవరకొండ రికార్డ్ ని టచ్ చేయలేకపోయిన ఎన్టీఆర్

Poor TRP Rating for Jr NTR 's Aravinda Sametha బుల్లితెర పై విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం మొదటిసారి 20 టిఆర్ పి రేటింగ్ సాధించగా మళ్ళీ రెండోసారి వేసినప్పుడు 17 రేటింగ్ సాధించింది కానీ ఆ రికార్డ్ ని ఎన్టీఆర్ అందుకోలేకపోయాడు . ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని ప్రముఖ ఛానల్ జీ తెలుగు ప్రసారం చేసింది అయితే ఈ సినిమాని చూడటానికి బుల్లితెర ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు దాంతో కేవలం 13. 7 రేటింగ్ మాత్రమే వచ్చింది .

అరవింద సమేత చిత్రం గురించి ప్రచారం సాగినప్పటికీ ఈ చిత్రాన్ని చూడటానికి ఎందుకో ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించలేదు దాంతో ఎన్టీఆర్ విజయ్ దేవరకొండ రికార్డ్ ని టచ్ చేయలేకపోయాడు . గీత గోవిందం రెండోసారి వేసినప్పుడు కూడా మంచి రేటింగ్ వచ్చింది కానీ అరవింద సమేత కు మొదటిసారే ఇంత దారుణమైన రేటింగ్ రావడంతో ఖంగుతిన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే ఆ చిత్ర బృందం . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత చిత్రం ఎన్టీఆర్ కు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది .

English Title: Poor TRP Rating for Jr NTR ‘s  Aravinda Sametha