హైద‌రాబాద్ నుంచి వెళ్లిపోయిన పూర్ణ‌?


హైద‌రాబాద్ నుంచి వెళ్లిపోయిన పూర్ణ‌?
హైద‌రాబాద్ నుంచి వెళ్లిపోయిన పూర్ణ‌?

మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీకి చెందిన ముగ్గురు వ్య‌క్తులు ఫేస్ బుక్ వేదిక‌గా త‌న‌ని వేధించార‌ని న‌టి పూర్ణ చేసిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. తాజాగా వారిని ఆరెస్ట్ చేసిన పోలీసులు మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీకి చెందిన హెయిర్ స్టైలిస్ట్ హ‌రీష్‌ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మోడ‌ల్స్‌ని కిడ్నాప్ చేసి డ‌బ్బులు డిమాండ్ చేసిన మ‌రో 8 మందిని కూడా తాజాగా పోలీసులు అరెస్ట్ చేశార‌ట‌.

పూర్ణ వివాహం చేసుకోవాల‌న్న ఏర్పాట్లలో వుంద‌ని తెలిసి ఆమెని ట్రాప్‌లోకి దింపాల‌ని మ్యారేజ్ బ్యూరో టీమ్ పేరుతో ఓ ముఠా ఆమె కుటుంబాన్ని మోస‌గించాల‌ని ప్ర‌య‌త్నించి అడ్డంగా బుక్ కావ‌డం కేర‌ళ ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేపుతోంది. ఇదిలా వుంటే గ‌త మూడు నెల‌లుగా హైద‌రాబాద్‌లో వుంటున్న పూర్ణ ఉన్న ఫ‌లంగా హైద‌రాబాద్ ని విడిచి కేర‌ళ‌లోని కొచ్చీకి ప్ర‌యాణ‌మైంది.

ఈ మంగ‌ళ‌వారం కొచ్చీకి చేరుకున్న పూర్ణ తాజా కేసులో కొచ్చీ పోలీసులకు స‌హ‌క‌రించ‌డానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. పూర్ణ ను విచారించి ఆమె స్టేట్‌మెంట్‌ని పోలీసులు రికార్డు చేసుకోనున్నార‌ట. తాజా ఉదంతంతో పూర్ణ పెళ్లి ప్ర‌య‌త్నాలు ఏ మ‌లుపు తీసుకుంటాయోన‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.