అశ్వనీదత్ పై బాంబ్ పేల్చిన పోసాని


posani krishnamurali
posani krishnamurali

టాలీవుడ్ లో నాకు అవకాశాలు రాకుండా చేస్తోంది అగ్ర నిర్మాత అశ్వనీదత్ అంటూ బాంబ్ పేల్చాడు ప్రముఖ నటుడు దర్శకుడు పోసాని కృష్ణమురళి . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పోసాని ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్నాడు . ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు . అయితే మీడియా సంస్థతో మాట్లాడిన పోసాని అశ్వనీదత్ నాకు వచ్చిన సినిమాని రాకుండా చేసాడు అంటూ కుండబద్దలు కొట్టి మరీ చెప్పాడు

ఏమాత్రం మొహమాటం లేకుండా మాట్లాడే పోసాని జగన్ కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే . చంద్రబాబు ని తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ జగన్ కు మద్దతు ఇచ్చాను కాబట్టే నాకు అవకాశాలు రాకుండా చూస్తున్నారు కొంతమంది ఇక అశ్వనీదత్ అయితే నాకు వచ్చిన సినిమాని రాకుండా చేసాడు అంటూ బాంబ్ పేల్చాడు . రేపు జగన్ కూడా మంచి పనులు చేయకపోతే విమర్శిస్తానని ఘంటాపథంగా చెబుతున్నాడు పోసాని