పుకార్లని ఖండించిన పోసాని


Posani krishna murali
Posani krishna murali

ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి పై రకరకాల పుకార్లు షికారు చేస్తుండటంతో వాటిని ఖండించాడు . అంతేకాదు ఓ వీడియో కూడా విడుదల చేసాడు . గతకొంత కాలంగా నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను , అది నిజమే అయితే దానికి ఆపరేషన్ కూడా జరిగింది . ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను , అయితే ఆపరేషన్ వికటించిందని , మళ్ళీ ఆపరేషన్ జరిగిందని పుకార్లు వినిపిస్తున్నాయి అవి నిజం కాదు , నేను కోలుకుంటున్నాను త్వరలోనే షూటింగ్ లలో పాల్గొంటాను అంటూ వివరణ ఇచ్చాడు పోసాని .

జగన్ ముఖ్యమంత్రి కావాలని , వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇచ్చిన పోసాని , ఆ పార్టీ కోసం మీడియా సమావేశాలు పెట్టి బాగానే ప్రచారం చేసాడు . అయితే జగన్ కు మద్దతుగా నిలిచిన పలువురు సినీ ప్రముఖులకు పదవుల పంపకం చేపట్టాడు . జగన్ కు మద్దతు ఇచ్చిన సినిమా వాళ్ళు చాలామందే ఉన్నారు మరి పోసాని కి ఏదైనా పదవి వరిస్తుందో? లేదో ? చూడాలి .