చంద్రబాబు పై నిప్పులు చెరిగిన పోసాని


posani krishnamurali fire on ap cm

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నిప్పుల వర్షం కురిపించాడు నటుడు పోసాని కృష్ణమురళి . ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నిజంగా కోరుకుంటే దానికి జనాలు రోడ్ల మీదకు రావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి తో పాటుగా తెలుగుదేశం పార్టీ కి చెందిన శాసనసభ్యులు , శాసన మండలి సభ్యులు , మంత్రులు విజయవాడలో నిరాహారదీక్ష చేస్తే సరిపోతుందని సవాల్ విసిరాడు .

చంద్రబాబు బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నాడని ఒకప్పుడు హోదా అవసరం లేదని , ప్యాకేజి సరిపోతుందని కానీ ఇప్పుడేమో మోడీ తో వచ్చిన గొడవల వల్ల ప్రత్యేక హోదా కావాలని ఇప్పుడు అడుగుతున్నాడని కానీ సినిమా వాళ్ళు ఎప్పుడో హోదా రావాల్సిందే అని విజయవాడలో దీక్ష కు వస్తే పోలీసుల చేత కొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేసాడు పోసాని . జగన్ పార్టీ కి పోసాని గట్టిగా మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే .