ఇప్పుడే చచ్చిపోను : పోసాని సంచలన వ్యాఖ్యలు


Posani Krishna Murali
Posani Krishna Murali

నా ఆరోగ్యం బాగోలేదని , లేదంటే చనిపోయాడని రకరకాల పుకార్లు సృష్టిస్తున్నారు సోషల్ మీడియాలో దాంతో ఇలా మీముందుకు రావాల్సి వచ్చిందని అంటున్నాడు పోసాని . ఇప్పుడే నేను చచ్చిపోను , హాయిగా ఉన్నాను ఆపరేషన్ విజయవంతమైంది డాక్టర్లకు నా ధన్యవాదాలు అంటూ నిన్న సాయంత్రం మీడియా ముందుకు వచ్చాడు నటుడు పోసాని కృష్ణమురళి .

ఆపరేషన్ జరిగింది , అయితే మొదటి ఆపరేషన్ ఫెయిల్ అయినప్పటికీ వెంటనే రెండోసారి మళ్ళీ చేసారు బాగున్నాను ఇదిగో కనిపిస్తున్నాను కదా ! కొంతమంది యూట్యూబ్ వాళ్ళు , వెబ్ సైట్ వాళ్ళు పోసాని ఆరోగ్యం విషమం అంటూ ప్రచారం చేయడంతో మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని అంటున్నాడు . ఇక జగన్ ని నాకు పదవి ఇవ్వమని నేను అడగను , ఒకవేళ ఇస్తే వద్దనను అని అంటున్నాడు . అంతేనా …… జగన్ పార్టీ పెట్టినప్పుడు నేను , రోజా మాత్రమే ఫిలిం ఇండస్ట్రీ నుండి ఉన్నవాళ్ళం అంతేకాని ఇప్పుడు ఉన్నవాళ్లు ఎవరూ లేరని పరోక్షంగా అలీ , పృథ్వీ పై కామెంట్ చేసాడు .