ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసానిPosani sensational comments on Jr. NTR
Posani sensational comments on Jr. NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు నటుడు , దర్శకుడు పోసాని కృష్ణమురళి . జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రి అవ్వడం కష్టమే అని , అది అంత ఈజీ కాదని అంటున్నాడు . జగన్ సొంతగా రాజకీయ పార్టీ పెట్టి పోరాటాలు చేసి ఈ దశకు చేరుకున్నాడని , ఎన్టీఆర్ కూడా సొంత పార్టీ పెట్టి అలా చేస్తే అధికారం దక్కుతుందేమో కానీ అంత ఈజీ మాత్రం కాదని అంటున్నాడు పోసాని .

తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే . దాంతో ఇక తెలుగుదేశం పార్టీ కనుమరుగు అవ్వడం ఖాయమని ఎందుకంటే చంద్రబాబు కి ఏజ్ మీద పడుతోంది , లోకేష్ కు నాయకత్వ లక్షణాలు లేవు అని సంచలన వ్యాఖ్యలు చేసాడు పోసాని . తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు అందించాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే మార్గం అని ముక్త కంఠంతో అంటుండటంతో పోసాని ఎన్టీఆర్ వచ్చినా పార్టీ పగ్గాలు చేపట్టినా ప్రయోజనం ఉండదని కుండబద్దలు కొట్టాడు .