ఇంతలో ఎన్నెన్ని వింతలో చిత్రానికి పాజిటివ్ టాక్


Positive talk to Inthalo ennenni vinthalo movie,నందు హీరోగా నటించిన ఇంతలో ఎన్నెన్ని వింతలో చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది విడుదల కు ముందే . కొత్త దర్శకుడు వరప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హాట్ భామ పూజా రామచంద్రన్ కీలక పాత్ర పోషించింది. కాగా ఈ సినిమాపై నమ్మకంతో రెండు రోజుల ముందు గానే మీడియా కి ప్రీమియర్ షో వేశారు. మీడియా తో పాటుగా ఆ సినిమాని చూసిన వాళ్ళు సినిమా పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలను మేళవించి అందించాడు దర్శకుడు వరప్రసాద్. వివివినాయక్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వరప్రసాద్ వినాయక్ లాగే ఎంటర్ టైన్ మెంట్ తో పాటు యాక్షన్ ని కలగలిపి అందించాడు. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మొత్తానికి ఇంతలో ఎన్నెన్ని వింతలో చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఆ చిత్ర బృందం సంతోషంగా ఉంది.