నన్ను దోచుకుందువటే పాజిటివ్ టాక్


Positive talk to nannu dochukunduvate

సుధీర్ బాబు, నాభ నటేష్ జంటగా నటించిన నన్ను దోచుకుందువటే చిత్రానికి విడుదలకు ముందే పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు , సెన్సార్ బోర్డ్ మెంబర్ కిషోర్ గౌడ్ చూసి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి చిత్రాన్ని చూశానని , కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ నన్ను దోచుకుందువటే అని సుధీర్ బాబు పై హీరోయిన్ నాభ నటేష్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

హీరో సుధీర్ బాబు సొంత బ్యానర్ లో రూపొందిన చిత్రం ఈ నన్ను దోచుకుందువటే . కొత్త దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు చెప్పిన కథ విని సొంత బ్యానర్ పై నిర్మించాడు సుధీర్ బాబు. ఇక ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. ఈనెల 21 న నన్ను దోచుకుందువటే రిలీజ్ కి సిద్ధమైన నేపథ్యంలో సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాడు హీరో సుధీర్ బాబు. సెన్సార్ టాక్ మాత్రమే కాకుండా ఫిల్మ్ నగర్ సర్కిల్లో కూడా సుధీర్ బాబు చిత్రానికి పూర్తిగా పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక దీని ఫలితం ఎలా ఉంటుందో అన్నది తెలియాలంటే మరో మూడు రోజులు ఎదురుచూడాల్సిందే.

English Title: Positive talk to nannu dochukunduvate