అన్నగారి మనవరాలు కాబట్టి ఆమెని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు . అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సుహాసిని కి మద్దతుగా ప్రచారం చేయడంతో టీడీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చింది . చాలామంది బహిరంగంగానే సుహాసిని కి మద్దతు ప్రకటిస్తూ మా ఓటు మీకే అని చెబుతున్నారు , ఆశీర్వదిస్తున్నారు . కూకట్ పల్లి లో సీమాంధ్రులు ఎక్కువ అలాగే తెలంగాణ వాళ్ళు సైతం నందమూరి సుహాసిని కే మా ఓటు అంటూ స్పష్టం చేస్తున్నారు . దాంతో లక్ష కు పైగా మెజారిటీతో నందమూరి సుహాసిని గెలవడం ఖాయమైపోయింది .
English Title: Positive wave for Nandamuri Suhasini in Kukatpally