శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి పాజిటివ్ బజ్


Possitive buzz on Shailajareddy alludu అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం ఈనెల 13న విడుదల అవుతుండగా ఈ చిత్రానికి మొదటి నుండి పాజిటివ్ బజ్ ఉంది ఇక సినిమా విడుదలకు సిద్దమయిన నేపథ్యంలో ఈ సినిమాకు మరింత పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడుతున్నాయి . రమ్యకృష్ణ శైలజారెడ్డి గా పవర్ ఫుల్ రోల్ పోషిస్తుండగా శైలజారెడ్డి అల్లుడిగా నాగచైతన్య నటిస్తున్నాడు . ఇగో సమస్య నేపథ్యంలో సాగే చిత్రంగా ఈ శైలజారెడ్డి అల్లుడు రూపొందినట్లు తెలుస్తోంది . అత్తా – అల్లుడు కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రాలన్నీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి .

వినోద ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంపై అక్కినేని నాగచైతన్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . నాగచైతన్యు గత చిత్రాలు ప్లాప్ కావడంతో ఈ సినిమాపై నమ్మకంగా ఉన్నాడు . మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగచైతన్య సరసన అనుపమా పరమేశ్వరన్ నటించింది .నాగార్జున కు అల్లరి అల్లుడు పెద్ద హిట్ కాగా ఆ చిత్రం మాదిరిగానే ఈ శైలజారెడ్డి అల్లుడు హిట్ కావాలని ఆశిస్తున్నారు అక్కినేని అభిమానులు .

English Title: Possitive buzz on Sailajareddy alludu