నాని సినిమాకు టాక్ బాగుంది కానీ …..


awe movie collections

వరుస విజయాలు సాధిస్తున్న నాని నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ” అ !” . ఫిబ్రవరి 16న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మల్టీప్లెక్స్ లలో మంచి ఆదరణే లభిస్తోంది అలాగే ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించాడని నానిపై ప్రశంసలు కురుస్తున్నాయి కానీ టాక్ మాదిరిగా వసూళ్లు మాత్రం రావడం లేదు . కాజల్ అగర్వాల్ , నిత్యా మీనన్ , రెజీనా , ఈషా తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు .

మొత్తం మూడు రోజుల్లో నాలుగున్నర కోట్ల షేర్ వసూల్ చేసింది అ చిత్రం . తెలుగు రాష్ట్రాలలో కంటే ఓవర్ సీస్ లో మాత్రం మంచి వసూళ్ల ని సాధిస్తోంది . ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్లు దాటేసింది , మరిన్ని వసూళ్లు సాధించడం ఖాయం అక్కడ అయితే ఇక్కడ మాత్రం అంతగా ప్రభావం చూపించడం లేదు . కాకపోతే నాని కి ఇది సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది ఎందుకంటే సాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో డబ్బులు వస్తాయి కాబట్టి .