రాక్షసుడు చిత్రానికి పాజిటివ్ టాక్


Rakshasudu
Rakshasudu

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు చిత్రానికి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది . రేపు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అవుతోంది . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమై ఇప్పటికి ఐదేళ్లు , ఈ అయిదేళ్ల కాలంలో అల్లుడు శీను చిత్రం తప్ప మరో సినిమా హిట్ కాలేదు దాంతో అప్పటి నుండి హిట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు .

తమిళంలో ఘనవిజయం సాధించిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . కాగా ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుందన్న ధీమాతో ఉన్నారు ఆ చిత్ర బృందం . ఇక హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అయితే డ్యామ్ ష్యుర్ గా హిట్ కొట్టబోతున్నానంటున్నాడు . ఇక సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకోవడంతో టాక్ కూడా స్ప్రెడ్ అవుతోంది అది పాజిటివ్ గా .