యువ‌త‌కు స్ఫూర్తినిచ్చే `పోస్టర్`!


యువ‌త‌కు స్ఫూర్తినిచ్చే `పోస్టర్`!
యువ‌త‌కు స్ఫూర్తినిచ్చే `పోస్టర్`!

ఆత్మ హ‌త్య‌లు వ‌ద్దు ఆత్మ‌స్థైర్యంతో ముందుడు వేస్తే మీదే జ‌యం అనే స్ఫూర్తి వంత‌మైన క‌థ‌తో వ‌స్తున్న చిత్రం `పోస్ట‌ర్‌`. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వున్న మెయిన్ థియేట‌ర్ల‌లో ఒకటి సంధ్యా థియేట‌ర్‌. ఇందులో గ‌త ప‌దేళ్లుగా ప్రొజెక్ట‌ర్‌గా ప‌దేళ్లు ప‌నిచేసిన టి. మ‌హిపాల్ రెడ్డి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీ సాయి పుష్పా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో విజ‌య్ ధ‌ర‌న్‌, రాశిసింగ్‌, అక్ష‌త సోనావానే హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు.

ఇటీవ‌లే ఈ చిత్ర టీజ‌ర్‌ని ప్ర‌ముఖ నిర్మాత డి. సురేష్‌బాబు రిలీజ్ చేశారు. టీజ‌ర్‌ని చూసిన త‌రువాత మ‌హిపాల్ రెడ్డి ప్ర‌తిభ ఏంటో అర్థ‌మైంద‌ని, త‌న‌కిదే తొలి చిత్ర‌మైన‌ప్ప‌టికి అనుభ‌వం వున్న ద‌ర్శ‌కుడిలా రూపొందించ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని అభినందించారు. టీజ‌ర్‌లో ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్‌కి ర‌ప్పించే అంశాలు చాలానే వున్నాయ‌ని, క‌థ‌. క‌థ‌నాలు కొత్త‌గా వున్నాయ‌ని, త‌ప్ప‌కుండా సినిమా విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌క‌ముందిన స్ప‌ష్టం చేశారు.

ద‌ర్శ‌కుడు మ‌హిపాల్‌రెడ్డి మాట్లాడుతూ ` సురేష్‌బాబుకు మా టీజ‌ర్ న‌చ్చ‌మే మా తొలి విజ‌యంగా భావిస్తున్నామ‌న్నారు. ప్ర‌తి ఇంట్లో జ‌రిగిన..జ‌రిగే క‌థ‌నే తాను ఈ చిత్రంలో చెప్పాన‌న్నారు. పోస్ట‌ర్ అంటించ‌డానికి కూడా ప‌నికిరాని ఓ యువ‌కుడు అదే పోస్ట‌ర్ పైకి ఎక్కే స్థాయికి ఎలా ఎదిగాడ‌న్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన ఇతివృత్తం. స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్పుడూ ధైర్యంగా నిల‌బ‌డి వాటిని అధిగ‌మించిన‌ప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తార‌ని, స‌మ‌స్య‌ల‌కు త‌లొంచి ఆత్మ హ‌త్య‌ల‌కు పాల్ప‌డొద్ద‌ని చెప్పే చిత్ర‌మిద‌ని, నేటి యువ‌త‌కు స్ఫూర్తినిచ్చే క‌థ ఇద‌ని, రాహుల్ సిప్లిగంజ్ ఈ చిత్రం కోసం పాడిన పాట ఆక‌ట్టుకుంటోంద‌ని వెల్ల‌డించారు.