ప‌వ‌ర్‌స్టార్ కోసం టైటిల్‌ రిజిస్ట‌ర్ చేశారు!


ప‌వ‌ర్‌స్టార్ కోసం టైటిల్‌ రిజిస్ట‌ర్ చేశారు!
ప‌వ‌ర్‌స్టార్ కోసం టైటిల్‌ రిజిస్ట‌ర్ చేశారు!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, ప్ర‌కాష్‌రాజ్‌, న‌రేష్ న‌టిస్తున్నారు. కీల‌క అతిథి పాత్ర‌లో హీరోయిన్‌గా లావ‌ణ్య త్రిపాఠిని ఫిక్స చేశారు.

ఇదిలా వుంటే ఈ సినిమాతో పాటు ప‌వ‌న్ మ‌రో చిత్రాన్ని అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నీ చిత్రాన్ని ఏ.ఎం. ర‌త్నం నిర్మిస్తున్నారు. 150 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతున్న‌ట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో అబ్బుర ప‌రిచే గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌.

మొఘ‌ల్ కాలం నాటి కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా కోసం ప‌లు భారీ సెట్‌ల‌ని నిర్మించి కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించారు. వాట‌ర్ ఫాల్స్ సెట్‌లో చిత్రీక‌రించిన పోరాట ఘ‌ట్టాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయ‌ని తెలిసింది. ఈ చిత్రానికి గ‌త కొన్ని రోజులుగా `విరూపాక్షా` అనే టైటిల్ వినిపిస్తోంది. మేక‌ర్స్ కూడా ఈ టైటిల్‌నే ఇటీవ‌ల ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ చేశార‌ని తెలిసింది.