ఆర్ ఆర్ ఆర్ టైటిల్ గోల మాములుగా లేదుగా !


ఆర్ ఆర్ ఆర్ టైటిల్ గోల మాములుగా లేదుగా !
RRR Title

ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి టైటిల్ ల గోల మాములుగా లేదు . ఆర్ ఆర్ ఆర్ అనే టైటిల్ ప్రతీ భాషలో ఉంటుంది కానీ దానికి తోడుగా ప్రతీ భాషలో మరో టైటిల్ కూడా ఉంటుంది అయితే ఆ టైటిల్ ఏంటి ? అన్నది మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు జక్కన్న దాంతో సోషల్ మీడియాలో రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నాయి అలాగే ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు కూడా పంపిస్తున్నారు రకరకాల టైటిల్స్ ని .

దాంతో మరోసారి ఇంకా టైటిల్స్ ని పంపించండి అంటూ ఊదర గొట్టేస్తున్నారు ఆర్ ఆర్ ఆర్ టీమ్ . ఇప్పటికే పలు టైటిల్స్ రాగా వాటిని అన్నింటిని కలిపి ఓ డిజైన్ చేసారు ఆర్ ఆర్ ఆర్ టీమ్ . అయితే తెలుగులో మాత్రం రామ రావణ రాజ్యం , రఘుపతి రాఘవ రాజారాం అనే టైటిల్స్ ఎక్కువగా వినబడుతున్నాయి . వీటితో పాటుగా పలు బాషలలో రకరకాల టైటిల్స్ ని జక్కన్న కు పంపిస్తున్నారు ఎన్టీఆర్ , చరణ్ ఫ్యాన్స్ .