ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి ఇక పండ‌గే.. టీజ‌ర్ వ‌చ్చేస్తోంది!


 

Powerstar Vakeel saab teaser date and time locked
Powerstar Vakeel saab teaser date and time locked

ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. శ్రీ‌రామ్ వేణు రూపొందిస్తున్న ఈ మూవీని బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. శృతిహాస‌న్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తోంది. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. దాదాపు రెండున్న‌రేళ్ల త‌రువాత ప‌వ‌న్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించి శృతిహాస‌న్‌, ప‌వన్‌క‌ల్యాణ్‌ల పోస్ట‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. బైక్‌పై ఇద్దరూ క‌లిసి రైడ్ చేస్తున్న ఫొటో ఆక‌ట్టుకుంటూ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఇందులో శృతిహాస‌న్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో క‌నిపించ‌బోతోంది. ఇందుకు సంబబంధించిన స‌న్నివేశాల్ని ఇటీవ‌లే నిజాం కాలేజ్‌లో చిత్రీక‌రించారు. ఈ స‌న్నివేశాలు సినిమాలో ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయ‌ట‌. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన టీజ‌ర్ ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా అని ప‌వర్‌స్టార్ ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

వారి ఎదురుచూపుల‌కు తెర‌దించుతూ `వ‌కీల్‌సాబ్‌` టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. జ‌న‌వ‌రి 14న సంక్రాంతి పండ‌గ రోజు సాయంత్ర 6:03 నిమిషాల‌కు `వ‌కీల్‌సాబ్‌` టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర బృందం వెల్ల‌డించింది. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. ఆ రోజు సోష‌ల్ మీడియాని వ‌రుస ట్వీట్ల‌తో మోతెక్కించ‌బోతున్నార‌ట‌.