ప్రభాస్ నెక్స్ట్ సినిమా విడుదల తేదీ ఖరారు


ప్రభాస్ నెక్స్ట్ సినిమా విడుదల తేదీ ఖరారు
ప్రభాస్ నెక్స్ట్ సినిమా విడుదల తేదీ ఖరారు

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోన్న విషయం తెల్సిందే. ఇక్కడి స్టూడియోల్లో నిర్మించిన పలు సెట్స్ లో షూటింగ్ సాగుతోంది. దీని తర్వాత ఫారిన్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న విషయం తెల్సిందే. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర షూటింగ్ మొదలవ్వడానికి అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పట్టిన విషయం తెల్సిందే. అందుకనే మొదట ఈ చిత్రాన్ని వేసవి తర్వాత విడుదల చేద్దామని భావించినా షూటింగ్ ఆలస్యమవుతుండడంతో సమ్మర్ 2021కి వస్తే ఎలా ఉంటుందన్న భావన కూడా చేశారు.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ చిత్ర విడుదల ఈ ఏడాదే ఉండనుంది. అది కూడా పండగ సీజన్ అయిన దసరా సమయంలోనే ఉంటుందని తెలుస్తుంది. అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇప్పటి నుండి నాన్ స్టాప్ గా మెజారిటీ షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. జులై కల్లా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలన్నది ప్లాన్. మరి ఆ దిశగా పనులు ఎంతవరకూ జరుగుతాయో తెలియాలంటే మరికొద్ది నెలలు వేచి చూడక తప్పదు.

ఇక ప్రభాస్ నెక్స్ట్ సినిమా గురించి అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ఈ ఇయర్ ఎండ్ నుండి షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రాన్ని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్నాడు. మరోసారి ఒక స్ట్రాంగ్ పాయింట్ ను చెప్పాలని అశ్విన్ ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ తెరకెక్కించనుంది. మరో ప్యాన్ ఇండియా మూవీనా అని దర్శకుణ్ణి అడిగితే అది ఎప్పుడో కొట్టేసారు ఇది ప్యాన్ వరల్డ్ ఫిల్మ్ అని చెప్పడం కొసమెరుపు.