ప్రభాస్ 20 కి టైటిల్ ఫిక్సయ్యింది!


ప్రభాస్ 20 కి టైటిల్ ఫిక్సయ్యింది!
ప్రభాస్ 20 కి టైటిల్ ఫిక్సయ్యింది!

యంగ్ రెబల్ స్టార్స్ ప్రభాస్ ‘సాహో ‘ తరువాత నటిస్తున్న 20వ చిత్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై కె. రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో టీం సాహసోపేతంగా జార్జియా వెళ్లి కీలక ఘట్టాల్ని పూర్తి చేసుకుని క్షేమంగా ఇండియా తిరిగి వచ్చింది.

ఆతరువాత టీమ్  టీమ్ అంటా హోమ్ క్వారెంటైన్ కె పరిమితం అయిపొయింది. ఫిస్ట్ లుక్ వస్తుందని ఫాన్స్ ఎదురుచూసారు. అది కుదిరేలా లేదని తెలిసి సోషల్ మీడియా వేదికగా మేకర్స్ పై యుద్ధమే ప్రకటించారు. దీంతో మేకర్స్ కరోనా కారణంగా ఫిస్ట్ లుక్ సాధ్యం కావడం లేదని జూన్ వరకు ఆగమని విజ్ఞప్తి చేయడంతో ఫాన్స్ వెనక్కి తగ్గి తాజాగా ఈచిత్రానికి ‘రాధేశ్యామ్’ టైటిల్ ని కన్ఫర్మ్ చేయమని ప్రచారం చేయడం ఆసక్తి కరంగా మారింది.
 ఇదిలా ఉంటే ఫాన్స్ ఫైనల్ చేసిన ‘రాధేశ్యామ్‘ టైటిల్ నే యువీ  క్రియేషన్స్ ఫైనల్ చేసినట్టు బాలీవుడ్ విమర్శకుడు శివ సత్యం తాజాగా సోషల్ మీడియా ట్విట్టర్ వేదిక వెల్లడించారు. ఇదే టైటిల్ ని మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయడానికి ఏర్పాట్లు మొదలుపెట్టినట్టు చెబుతున్నారు.