`ఆదిపురుష్‌` కోసం అప్పుడే ప‌ని మొద‌లుపెట్టారు!

`ఆదిపురుష్‌` కోసం అప్పుడే ప‌ని మొద‌లుపెట్టారు!
`ఆదిపురుష్‌` కోసం అప్పుడే ప‌ని మొద‌లుపెట్టారు!

పాన్‌ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం `రాధేశ్యామ్‌`. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఆ వెంట‌నే ప్ర‌భాస్ రెండు భారీ చిత్రాల‌ని ప్రారంభించేస్తున్నారు. అందులో ప్ర‌ధానంగా వినిపిస్తున్న పేరు `ఆది పురుష్‌`. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని 3డీ ఫార్మాట్‌లో అత్యంత భారీ సాంకేతికతో తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

బాలీవుడ్ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ టి సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంది. రామాయ‌ణ ఇతివృత్తాన్ని నేప‌థ్యంగా తీసుకుని స‌రికొత్తగా సాంకేతిక‌త‌ని జోడించి ఈ మూవీని `అవ‌తార్‌` రేంజ్‌లో తెర‌పైకి తీసుకురావాల‌ని ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. మైథ‌లాజిక‌ల్ చిత్రం కావ‌డంతో ఈ చిత్రానికి గ్రాఫిక్స్ ప్ర‌ధాన హైలైట్‌గా నిల‌వ‌నున్నాయ‌ట‌. ఇందు కోసం ఏకంగా ఏడాది పాటు గ్రాఫిక్స్ వ‌ర్క్ కోస‌మే కేటాయించ‌బోతున్నార‌ట‌.

మూడు నెల‌ల్లో చిత్రాన్ని పూర్తి చేసి గ్రాఫిక్స్ కోసం ఏడాది పాటు శ్ర‌మించనున్న‌ట్టు తెలిసింది. ఇందు కోసం హాలీవుడ్ చిత్రాల స్థాయిలో బ‌డ్జెట్‌ని కూడా ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు తెలిసింది. హాలీవుడ్‌కు చెందిన రెండు ప్ర‌ముఖ గ్రాఫిక్స్ సంస్థలు ఇటీవ‌ల ఈ చిత్రం కోసం వ‌ర్క్ ప్రారంభించిన‌ట్టు బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇందులో అవ‌తార్ త‌ర‌హాలో ప్ర‌భాస్ నీలివ‌ర్ణంలో క‌నిపించ‌నున్నార‌ట‌. ఇందు కోసం భారీ స్థాయిలో గ్రాఫిక్స్‌ని వాడ‌బోతున్నార‌ని ఇండియ‌న్ స్క్రీన్‌పై న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఈ మూవీ గ్రాఫిక్స్ వుండ‌నున్నాయ‌ని తెలిసింది.