ప్ర‌భాస్ `ఆదిపురుష్` మోష‌న్ క్యాప్చ‌ర్ మొద‌లైంది!

ప్ర‌భాస్ `ఆదిపురుష్` మోష‌న్ క్యాప్చ‌ర్ మొద‌లైంది!
ప్ర‌భాస్ `ఆదిపురుష్` మోష‌న్ క్యాప్చ‌ర్ మొద‌లైంది!

ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం `ఆదిపురుష్‌`. బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. బాలీవుడ్ బ‌డా నిర్మాణ సంస్థ టి సిరీస్ బ్యాన‌ర్‌పై భూష‌ణ్ కుమార్‌, క్రిష్ణ కుమార్ ప్ర‌సాద్ సుతార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీ తెర‌కెక్క‌బోతోంది. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా అని ప్ర‌భాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్ర‌భాస్ న‌టిస్తున్న తొలి పౌరాణిక గాధ కావ‌డంతో ఈ మూవీపై స‌హ‌జంగానే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.  3డి ఫార్మాట్లో హై ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాల‌కు మాత్ర‌మే ఉప‌యోగించే మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీని వీఎఫ్ ఎక్స్‌కి జోడించి ఈ చిత్రాన్ని చిత్రీక‌రించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన మోష‌న్ క్యాప్చ‌ర్ వ‌ర్క్‌ని చిత్ర బృందం మంగ‌ళ‌వారం ప్రారంభించింది. ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని లాంచ్ చేయ‌బోతున్నారు.

ఈ మూవీకి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చిత్రానికి ప్రత్యేకమైన సాంకేతికతని వినియోగించ‌బోతున్నారు. ఈ త‌ర‌హా టెక్నాల‌జీ భారతీయ సినిమాల్లో వాడ‌టం ఇదే మొదటి సారి. రియల్ టైమ్ టెక్నాలజీకి వీఎఫ్‌ఎక్స్ ని జోడించి `ఆదిపురుష్`ని తెర‌కెక్కిచ‌బోతున్నారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో రాముడిగా ప్ర‌భాస్ న‌టించ‌నుండ‌గా, రావ‌ణుడిగా సైఫ్ అలీఖాన్ న‌టించ‌నున్నారు.

తాజా టెక్నాట‌జీ గురించి నిర్మాత భూష‌ణ్‌‌కుమార్ మాట్లాడుతూ `ఓం, అతని బృందం అంతర్జాతీయ సినిమాల్లో సాధారణంగా ఉపయోగించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో `ఆదిపురుష్` ప్రపంచాన్ని రీ క్రియేట్ చేస్తున్నారు. ఇలా చేయ‌డం భారతీయ చిత్ర నిర్మాణంలో మొట్ట‌మొదటిసారి. `ఆదిపురుష్`‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం గర్వంగా ఉంది` అన్నారు.

మరో నిర్మాత ప్రసాద్ సుతార్ మాట్లాడుతూ `రియల్ టైమ్ టెక్నాలజీతో కలిపి హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ సాధారణంగా అంతర్జాతీయ చిత్రాలలో ఉపయోగిస్తారు. `ఆదిపురుష్` ప్రపంచాన్ని సృష్టించడానికి పురాణ కథను చెప్పడానికి మేము ఈ విధానాన్ని ఎంచుకున్నాము. `ఆదిపురుష్` మనందరికీ ఒక భారీ మిషన్. భూషణ్జీతో కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించాలని మేము ఎదురుచూస్తున్నాము` అని అన్నారు.