లండన్ కు జంటగా వెళ్తున్న ప్రభాస్ – అనుష్క


Prabhas And Anushka Shetty
Prabhas And Anushka Shetty

తెలుగు తెరపై చూడముచ్చటైన జంట ప్రభాస్ – అనుష్క లది అన్న విషయం అందరికీ తెలిసిందే . సాలిడ్ జంటగా పేరు తెచ్చుకున్న ఈ జంట లండన్ కు జంటగా వెళ్లనున్నారు . అదేంటీ ఈ ఇద్దరూ ఏ సినిమాలో నటించడం లేదు కదా ! మరి జంటగా ఎందుకు వెళ్తున్నారు అనే కదా మీ డౌట్ ! బాహుబలి 1 , బాహుబలి 2 చిత్రాలు లండన్ లో ప్రీమియర్ షో మాదిరిగా స్పెషల్ షో అరెంజ్ చేసారు నిర్వహకులు దానికి బాహుబలి యూనిట్ అంతా వెళ్తున్నారు .

అందులో ప్రభాస్ – అనుష్క కూడా జంటగా వెళ్ళడానికి సిద్ధమయ్యారు . బాహుబలి 1 , బాహుబలి 2 సంచలన విజయాలు సాధించిన విషయం విదితమే ! ఇక ప్రభాస్ – అనుష్కల మధ్య ఏదో ఉందని అందుకే ఎవరు కూడా పెళ్లి చేసుకోవడం లేదనే పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి .