ఇట‌లీ వీధుల్లో మాస్క్‌తో ప్ర‌భాస్ టీమ్‌ హ‌ల్‌చ‌ల్‌!


ఇట‌లీ వీధుల్లో మాస్క్‌తో ప్ర‌భాస్ టీమ్‌ హ‌ల్‌చ‌ల్‌!
ఇట‌లీ వీధుల్లో మాస్క్‌తో ప్ర‌భాస్ టీమ్‌ హ‌ల్‌చ‌ల్‌!

ఇటలీలో “రాధే శ్యామ్” షూట్ జరుగుతోంది. పుట్టినరోజు అమ్మాయి పూజా హెగ్డేకు విషెస్ తెలుపుతూ సినిమా సెట్స్ నుండి ఫోటో వచ్చింది. ఈ రోజు బుట్ట‌బొమ్మ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే పుట్టిన రోజు జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ఆమె క్యారెక్ట‌ర్ నేమ్‌ని రివీల్ చేసింది. ఈ సంద‌ర్భంగా ఈ మూవీలో న‌టిస్తున్న బాలీవుడ్ న‌టుడు కునాల్ రాయ్ క‌పూర్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఓ ఫొటోని షేర్ చేశాడు.

త‌న‌తో పాటు ప్రభాస్, పూజా హెగ్డే  ఫేస్ మాస్క్‌లు ధరించారు. సినిమా సెట్స్‌లో తీసుకున్న ఫొటో ఇది. కెమెరా ముందుకు వ‌చ్చిన‌ప్పుడు.. షాట్ రెడీ అన్న‌ప్పుడు మాత్ర‌మే త‌మ ఫేస్ మాస్క్‌ల్ని తొల‌గించి కెమెరా ముందుకు వ‌స్తున్నారు. షూట్ స‌మ‌యంలో త‌ప్ప ఎవ్వ‌రూ ఫేస్ మాస్కులు తీయ‌రాద‌ని సెట్‌లో కండీష‌న్ పెట్టుకున్నార‌ట‌. అందులో భాగంగానే  ప్ర‌భాస్‌, కునాల్ రాయ్‌, పూజా హెగ్డే ఫేస్ మాస్క్‌లు పెట్టుకున్న ఫొటో నెట్టింట్లో సంద‌డి చేస్తోంది.

రాబోయే రెండు నెలల్లో ఈ మూవీ షూట్ పూర్తి చేయడానికి ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఎందుకంటే వెంట‌నే `ఆదిపురుష్‌` సెట్‌లోకి డిసెంబ‌ర్ నుంచి వెళ్లాలి కాబ‌ట్టి స్పీడుగా ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి చేయాల‌ని ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.