ప్ర‌భాస్ -ప్ర‌శాంత్ నీల్‌ల పాన్ ఇండియా మూవీ `స‌లార్‌`!ప్ర‌భాస్ -ప్ర‌శాంత్ నీల్‌ల పాన్ ఇండియా మూవీ `స‌లార్‌`!
ప్ర‌భాస్ -ప్ర‌శాంత్ నీల్‌ల పాన్ ఇండియా మూవీ `స‌లార్‌`!

ఒక్క సినిమా ప‌డితే చాలు జాత‌కం మారిపోతుంది అంటుంటారు సినీ జ‌నాలు ఆ మాట యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ విష‌యంలో అక్ష‌రాలా నిజ‌మైంది.  ఒక్క సినిమాతో ఆయ‌న జాత‌కమే పాన్ ఇండియా లెవెల్లో మారిపోయింది. ప్ర‌పంచం మొత్తం ఆయ‌న పేరు మారుమ్రోగేలా చేసింది అదే `బాహుబ‌లి`. ఈ మూవీతో వ‌ర‌ల్డ్ వైడ్‌‌గా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నారు. దీని ద్వారా వ‌చ్చిన క్రేజ్ ఆయ‌న‌ని పాన్ ఇండియా స్టార్‌గా నిల‌బెట్టింది. ఈ మూవీ త‌రువాత ఆయ‌న ఆ స్థాయి చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం `రాధేశ్యామ్` చిత్రంలో న‌టిస్తున్న ఆయ‌న వ‌రుస‌గా మూడు పాన్ ఇండియా చిత్రాల‌ని లైన్‌లో పెట్టారు. నాగ్ అశ్విన్ మూవీ, ఓమ్ రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌పైకి రానున్న `ఆదిపురుష్‌`. తాజాగా `కేజీఎఫ్` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ చిత్రం. `కేజీఎఫ్‌` మూవీతో పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించిన హొంబ‌లే ఫిల్మ్స్ అధినేతి విజ‌య్ కిరగందూర్ ఈ బుధ‌వారం కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించ‌బోతున్నామంటూ ప్ర‌క‌టించ‌డంతో ఖ‌చ్చితంగా అది ప్ర‌భాస్‌తో చేయ‌బోతున్నార‌ని వార్త‌లు మొద‌ల‌య్యాయి. ఆ వార్త‌ల్ని నిజం చేస్తూ ప్ర‌‌భాస్‌తో పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని ప్ర‌క‌టించారు.

`స‌లార్‌` అనే పేరుతో ఈ మూవీని తెర‌కెక్కించ‌బోతున్నారు. ఫ‌స్ట్ లుక్ టైటిల్ పోస్ట‌ర్‌లో ఐర‌న్ బాక్స్‌ల‌పై కూర్చుని ఏకే 47 గ‌న్‌పై చేయి వేసి తీక్ష‌ణ‌మైన చూపుల‌తో ప్ర‌భాస్ హాలీవుడ్ హీరోలా క‌నిపిస్తున్నాడు. `ది మోస్ట్ వైలెంటెడ్ మెన్` అనే క్యాప్ష‌న్‌ని ఈ పోస్ట‌ర్‌కి యాడ్ చేశారు. మూవీ చూస్తుంటే `కేజీఎఫ్‌`కి మించి హాలీవుడ్ స్థాయిలో వుండేలా క‌నిపిస్తోంది. హోంబ‌లే ఫిల్మ్స్ మేకింగ్‌.. ప్ర‌భాస్ యాక్టింగ్‌.. ప్ర‌శాంత్ నీల్ టేకింగ్‌తో ఈ మూవీని వండ‌ర్స్ క్రియేట్ చేయ‌డం గ్యారెంటీ. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంద‌ని, `రాధేశ్యామ్‌` రిలీజ్ త‌రువాత ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నామ‌ని, భార‌తీయ భాష‌ల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత తెలిపారు. ఈ మాట‌ల్ని బ‌ట్టి చూస్తే ఈ మూవీని `ఉగ్రమ్‌` ఆధారంగా తెర‌పైకి తీసుకురానున్న‌ట్టు తెలుస్తోంది.