బాహుబ‌లి- జ‌క్క‌న్న కొత్త ప్ర‌యోగం!


బాహుబ‌లి- జ‌క్క‌న్న కొత్త ప్ర‌యోగం!
బాహుబ‌లి- జ‌క్క‌న్న కొత్త ప్ర‌యోగం!

`బాహుబ‌లి` సిరీస్ చిత్రాల‌తో తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంత‌రాల‌కు పాకింది. ఈ సినిమాతో హీరోగా ప్ర‌భాస్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి ద‌క్కిన ప్ర‌శంస‌లు అంతా ఇంతా కాదు. ఈ సినిమా త‌రువాత మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌లిసి మ్యాజి

క్  చేయ‌బోతున్నార‌ట‌. అయితే వేరే బ్యాన‌ర్‌లో కాదండోయ్ సొంత బ్యాన‌ర్‌లోనే. `జాన్` షూటింగ్‌లో వున్న ప్ర‌భాస్, `ఆర్ ఆర్ ఆర్‌` తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తున్న రాజ‌మౌళి త్వ‌ర‌లో క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని తెలిసింది.

ఇద్ద‌రు క‌లిసి సొంతంగా ఓ బ్యాన‌ర్‌ని స్థాపించి తొలి చిత్రాన్ని వ‌చ్చేఏడాది చేయ‌బోతున్నార‌ట‌. దీనికి రాజ‌మౌళి, ప్ర‌భాస్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని. ఈ బ్యాన‌ర్ నిర్మించే తొలి చిత్రానికి రాజ‌మౌళి డైరెక్ట్ చేయ‌నుండ‌గా, ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తార‌ట. త్వ‌ర‌లోనే ఈ బ్యాన‌ర్‌కు సంబంధించిన టైటిల్‌ని ఖ‌రారు చేయాల‌నే ఆలోచ‌న‌లో ప్ర‌భాస్‌, రాజ‌మౌళి వున్న‌ట్టు తెలిసింది.

`జిల్‌` ఫేమ్ రాధాకృష్ణ‌కుమార్ రూపొందిస్తున్న `జాన్‌` చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ సెవెన్ ఎక‌ర్స్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో జ‌రుగుతోంది. ఈ సినిమా త‌రువాత శంక‌ర్‌తో కానీ, సురేంద‌ర్‌రెడ్డితో కానీ ప్ర‌భాస్ సినిమా చేసే అవ‌కాశాలు వున్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ప్ర‌భాస్ మ‌ళ్లీ జ‌క్క‌న్న‌కే జైకొట్టార‌ని, సొంత బ్యాన‌ర్‌పై ఈ సినిమా వుంటుంద‌ని తాజాగా వార్త‌లు షికారు చేస్తుండ‌టం ప‌లువురిని షాక్‌కి గురిచేస్తోంది.