ప్ర‌భాస్ 21కి ముందే `ఆదిపురుష్‌`సెట్ పైకి!


Prabhas begins shoot fist Adipurush not nag aswin film
Prabhas begins shoot fist Adipurush not nag aswin film

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పాన్ ఇండియా స్థాయిలో వ‌రుస చిత్రాల్ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే మూడు చిత్రాల్ని ప్ర‌భాస్ లైన్‌లో పెట్టిన విష‌యం తెలిసిందే. యువీ బ్యాన‌ర్‌లో చేస్తున్న `రాధేశ్యామ్‌` ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లో బ్యాలెన్స్ షూట్‌ని ప్రారంభించ‌బోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ మూవీ త‌రువాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో ఓ భారీ చిత్రాన్ని చేయ‌బోతున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి. అశ్వ‌నీద‌త్ నిర్మించ‌బోతున్నారు. దీపిక ప‌దుకోన్‌, బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌నున్న ఈ మూవీకి  ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కులు  సింగీతం శ్రీ‌నివాస‌రావు మెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించనున్న విష‌యం తెలిసిందే. ఇది ప్ర‌భాస్ న‌టించ‌నున్న 21వ చిత్రం.

అయితే తాజా ప‌రిణామాల నేఫ‌థ్యంలో ఈ మూవీ వెన‌క్కి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ఈ మూవీకంటే ముందే బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ తెర‌కెక్కించ‌నున్న `ఆదిపురుష్‌` చిత్రాన్ని ప్ర‌భాస్ సెట్స్ పైకి తీసుకురాబోతున్నార‌ట‌. ఇట‌లీ నుంచి ముంబై వ‌చ్చిన ప్ర‌భాస్ నే‌రుగా వెళ్లి ద‌ర్శ‌కుడు ఓమ్  రౌత్‌ని క‌లిశారు. ప్ర‌భాస్‌కి పూర్తి స్క్రిప్ట్ వివ‌రించిన ఓమ్ రౌత్ ప్ర‌భాస్‌పై లుక్ టెస్ట్ నిర్వ‌హించార‌ట‌. లుక్ ఫైన‌ల్ కావ‌డంతో ప్ర‌భాస్ జ‌న‌వ‌రి నుంచి డేట్స్ ఇచ్చేశార‌ని తెలిసింది. టి సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని 450 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.