అనుష్కతో బీచ్ కెళ్లాలని ఆశపడుతున్న ప్రభాస్


Prabhas And Anushka Shetty
Prabhas And Anushka Shetty

అనుష్క త్వరగా నువ్వైనా పెళ్లి చేసుకో లేకపోతే మనిద్దరి మధ్య ఏదో ఉందని వస్తున్న పుకార్లని ఆపలేం అని అనుష్క కు ఉచిత సలహా ఇస్తున్నాడు ప్రభాస్ . అనుష్క – ప్రభాస్ లు డేటింగ్ లో ఉన్నారని , త్వరలో పెళ్లి చేసుకోనున్నారని రకరకాల పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి చాలాకాలంగా . అయితే ఈ పుకార్లని కొట్టిపడేస్తున్నారు ప్రభాస్ – అనుష్క లు కానీ అవి మాత్రం ఆగడం లేదు .

నేను – అనుష్క ప్రేమలో ఉంటే ఏ ఇటలీ కో వెళ్ళేవాళ్ళం లేదంటే ఏదైనా బీచ్ లో ఉండేవాళ్ళం కానీ మేము అలా చేయలేదే ! ఎక్కడా అలా కనిపించలేదే అయినప్పటికీ మా మీద ఈ రూమర్స్ ఆగడం లేదు అందుకే అనుష్క ని త్వరగా పెళ్లి చేసుకోమని చెబుతాను అని అంటున్నాడు ప్రభాస్ . అంటే ప్రభాస్ మనసులో అనుష్కతో బీచ్ కెళ్లాలని ఎంజాయ్ చేయాలని ఆశగా ఉందన్నమాట ! కొన్ని కొన్ని విషయాలు అలా అనుకోకుండా బయట పడిపోతాయి ఇది కూడా ఇంతే అనుకుంటా !