రవీనా కొంగు పట్టుకున్న ప్రభాస్ 


 Prabhas Dances with Raveena tandon
Prabhas Dances with Raveena tandon

90 వ దశకంలో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ రవీనా టాండన్ కొంగు పట్టుకొని హీరో ప్రభాస్ చేసిన డ్యాన్స్ వైరల్ అవుతోంది . సాహో ప్రమోషన్ కోసం ముంబై లో మీడియా సంస్థలను చుట్టేస్తున్నాడు ప్రభాస్ అండ్ కో . అందులో భాగంగా రవీనా టాండన్ నిర్వహిస్తున్న ఓ షోకి వెళ్ళాడు . అక్కడ రవీనా టాండన్ కొంగు ని తన పంటి తో పట్టుకొని టిప్ టిప్ బర్సా పానీ ….. అంటూ స్టెప్పులు వేసాడు ప్రభాస్ .

రవీనా టాండన్ ప్రభాస్ కు చాలా సన్నిహితురాలు . ముంబై కి వెళితే తప్పకుండా రవీనా టాండన్ ఇంట్లోనే ఎక్కువగా ఉంటాడు ప్రభాస్ . రవీనా భర్త అనిల్ తడాని  ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కావడంతో బాహుబలి చిత్రాన్ని రవీనా భర్త అనిల్  కూడా డిస్ట్రిబ్యూట్ చేసాడు . దాంతో రవీనా తో పాటుగా ఆమె భర్త కూడా ప్రభాస్ కు మంచి ఫ్రెండ్స్ అయ్యారు . ఆ చనువుతోనే రవీనా టాండన్ కొంగుని తన పంటితో పట్టుకొని డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చాడు .