కరోనా క్రైసిస్ చారిటీకి ప్రభాస్ మరో రూ.50 లక్షలు


Prabhas declared another rs.50 lakhs for corona crisis charity
Prabhas declared another rs.50 lakhs for corona crisis charity

యంగ్ రెబల్ స్టార్ ఇండియన్ బాహుబలి ప్రభాస్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా ఇప్పటికే భాగంగా దేశ రాష్ట్ర ప్రభుత్వాలకుకలిపి మొత్తం నాలుగు కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన ప్రభాస్; తెలుగు సినిమా ఇండస్ట్రీలో కార్మికుల సంక్షేమం కోసం స్థాపించబడిన “కరోనా క్రైసిస్ చారిటీ” సంస్థకు మరొక 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. అదేవిధంగా ఆయన స్నేహితుల నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. దీంతో కలిపి మొత్తం ఆయన సహాయం 4.5 కోట్లకు చేరింది.

 ప్రస్తుతం “జిల్” ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక మంచి లవ్ స్టోరీ చేస్తున్న ప్రభాస్ జార్జియా నుంచి షూటింగ్ ముగించుకొని తిరిగి వచ్చిన అనంతరం తన ఇంటిలోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నట్లు ప్రకటించారు. అభిమానులు కూడా ప్రస్తుతం ఈ లాక్ డౌన్ కాలంలో సురక్షితంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు పాటించాలని ప్రభాస్ విజ్ఞప్తి చేశారు.