`ఆది పురుష్‌` రిలీజ్ డేట్ ప్ర‌క‌టించి షాకిచ్చారు!

`ఆది పురుష్‌` రిలీజ్ డేట్ ప్ర‌క‌టించి షాకిచ్చారు!
`ఆది పురుష్‌` రిలీజ్ డేట్ ప్ర‌క‌టించి షాకిచ్చారు!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు క‌మిటైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం న‌టిస్తున్న `రాధేశ్యామ్‌` స‌మ్మ‌ర్ రేసులో రిలీజ‌వుతుంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మూవీ రిలీజ్ తేదీపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యువీ క్రియేష‌న్స్‌, … టి సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ ‌గా న‌టిస్తోంది. ఫిక్ష‌న‌ల్ పిరియాడిక్ ల‌వ్ ‌స్టోరీగా యూర‌ప్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఈ మూవీ పూర్త‌యిన వెంట‌నే ప్ర‌భాస్ నాగ్ అశ్విన్ మూవీని కాకుండా `ఆది పురుష్ 3డి` చిత్రాన్ని ప్రారంభించ‌బోతున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి నుంచి ప్రారంభం కాబోతోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ‌ని హీరో ప్ర‌భాస్ గురువారం ఉద‌యం 7:11 నిమిషాల‌కు ప్ర‌క‌టించి స‌ర్ ‌ప్రైజ్ చేశారు.

త్రీడీ ఫార్మాట్ ‌లో రామాయణ‌ గాథ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని 11 ఆగ‌స్టు 2022న రిలీజ్ చేయ‌బోతున్నామ‌ని ప్ర‌భాస్ ప్ర‌క‌టించారు. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. `రాధేశ్యామ్‌` త‌రువాత ప్ర‌భాస్‌.. నాగ్ అశ్విన్ సినిమా చేస్తాడా? లేక `ఆది పురుష్‌`ని ప్రారంభిస్తాడా అని కొంత క‌న్‌ ఫ్యూజ‌న్ కి తాజా ప్ర‌క‌ట‌న‌తో తెర‌ప‌డిన‌ట్ట‌య్యింది. ప్ర‌భాస్ ప్ర‌క‌టనతో పూర్తి స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఇందులో రావ‌ణ్ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. మిగ‌తా కీల‌క పాత్ర‌లకు సంబంధించి ఎవ‌రు న‌టించ‌నున్నార‌న్న‌ది మేక‌ర్స్ ప్ర‌క‌టించాల్సి వుంది.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)