ప్ర‌భాస్‌పై మ‌ళ్లీ చ‌ర్చ మొద‌లైంది!Prabhas demanding 70 cres for nag ashwin film
Prabhas demanding 70 cres for nag ashwin film

`బాహుబ‌లి` సినిమాతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఆయ‌న నుంచి సినిమా వ‌స్తోందంటే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెరుగుతోంది. `సాహో` త‌రువాత ప్ర‌భాస్ న‌టిస్టున్న చిత్రం `రాధేశ్యామ్‌`. `జిల్‌` ఫేమ్ రాధాకృష్ణ‌కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గోపీ కృష్ణా మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ బ్యాలెన్స్ గా వుంది. ఇదిలా వుంటే ఈ సినిమా త‌రువాత ప్ర‌భాస్ మ‌రో భారీ చిత్రాన్ని అంగీక‌రించిన విష‌యం తెలిసిందే.

`మ‌హాన‌టి` ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి. అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హాట్ లేడీ దీపికా ప‌దుకునే హీరోయిన్‌గా న‌టించ నుంది. సైన్స్ ఫిక్ష‌న్‌గా తెర‌పైకి రానున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ప్రారంభించబోతున్నారు. ఇందు కోసం భారీ స్థాయిలో సెట్‌ల‌ని నిర్మిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రానికి ప్ర‌భాస్ భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

పాన్ ఇండాయాకు మించి ఐదు ప్ర‌ధాన భాష‌ల్లో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్ర‌భాస్ 70 కోట్లు తీసుకుంటున్నార‌ట‌. దాదాపు 400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ద‌క్షిణాది భాష‌ల్లో డ‌బ్బింగ్ కాబోతున్న ఈ చిత్ర అనువాద హ‌క్కుల విష‌యంలోనే ప్ర‌భాస్‌కు 50 శాతం వాటా రానుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం దీపిక ప‌దుకునే 18 కోట్లు తీసుకుంటోందంటూ ఇప్ప‌టికే వార్త‌లు షికారు చేస్తున్నాయి.