ప్ర‌భాస్ అందుకు అర్హుడే: అల్లు అర్జున్‌!


ప్ర‌భాస్ అందుకు అర్హుడే: అల్లు అర్జున్‌!
ప్ర‌భాస్ అందుకు అర్హుడే: అల్లు అర్జున్‌!

`బాహుబ‌లి` చిత్రాన్ని, అందులో న‌టించిన ప్ర‌భాస్‌ని పొగ‌డ‌ని హీరో లేరు. టాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది, ఉత్త‌రాది తార‌లంతా ప్ర‌భాస్‌కు జేజేలు ప‌లికారు కానీ ఒక్క‌రు మాత్రం `బాహుబ‌లి` ప్ర‌స్థావ‌నే తీసుకురాలేదు. ఆయ‌నే స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్. తాజాగా బ‌న్నీ `బాహుబ‌లి`పై, అందులో న‌టించిన ప్ర‌భాస్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`.

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించ‌న ఈ చిత్రం సంక్రాంతి బ‌రిలో నిలిచి నాన్ బాహుబ‌లి రికార్డుల్ని సొంతం చేసుకున్న‌విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం మీడియాతో ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా బ‌న్నీ మాట్లాడుతూ “బాహుబ‌లి` గురించి నేను ఇప్ప‌టి వ‌ర‌కు మాట్లాడే అవ‌కాశం రాలేదు. సినిమా స‌మ‌యంలో రాజ‌మౌళిగారికి మాత్రం వ్య‌క్తి గ‌తంగా చెప్పాను. `బాహుబ‌లి` సినిమాతో ప్ర‌భాస్‌కు ఎంత పేరొచ్చినా అందుకు అత‌ను అర్హుడే. `మిర్చి` లాంటి సినిమా త‌రువాత ఐదేళ్లు ఒక క‌మ‌ర్షియ‌ల్ హీరో ఎన్నో కోట్లు సంపాదించుకుని ఉండొచ్చు. ఐదేళ్ల‌లో ఒక‌టిన్న‌ర ఏడాది మాత్ర‌మే వ‌ర్కింగ్ డేస్` అన్నారు.

అంత కాలం ఒక విష‌యాన్ని న‌మ్మి కూర్చున్న దానికి, ప్రభాస్ త్యాగం చేసిన‌దానికి అత‌నికి `బాహుబ‌లి`తో ఎంత పేరొచ్చిందో ఆ పేరుకి అత‌ను అక్ష‌రాలా అర్హుడే` అని బ‌న్నీ స్ప‌ష్టం చేశారు. అల్లు అర్జున్ కొంత విరామం త‌రువాత సుకుమార్ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ పూర్త‌యిన ఈ చిత్రం త‌దుప‌రి షెడ్యూల్ ఫిబ్ర‌వ‌రి నుంచి ప్రారంభం కాబోతోంది.