డార్లింగ్ సినిమా..అదో కొత్త ప్ర‌పంచం!

డార్లింగ్ సినిమా..అదో కొత్త ప్ర‌పంచం!
డార్లింగ్ సినిమా..అదో కొత్త ప్ర‌పంచం!

ప్ర‌భాస్ సినిమా సినిమాకి త‌న రేంజ్‌ని పెంచేస్తున్నాడు. ప్రేక్ష‌కుల‌కు కొత్త ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేస్తున్నాడు. `బాహుబ‌లి` సిరీస్‌తో స‌రికొత్త అనుభూతిని క‌లిగించిన ప్ర‌భాస్ త‌న త‌దుప‌రి చిత్రం `సాహో`తో గ్యాంగ్‌స్ట‌ర్స్ వ‌ర‌ల్డ్‌ని స‌రికొత్త‌గా ప‌రిచ‌యం చేశారు. తాజాగా మ‌ళ్లీ అలాంటి ప్ర‌య‌త్నాన్నే చేయ‌బోతున్నారు ప్ర‌భాస్‌.

ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం `జాన్‌` (ఇంకా టైటిల్ క‌న్ఫ‌మ్ చేయ‌లేదు). యువీతో క‌లిసి కృష్ణంరాజు గోపీకృష్ణామూవీస్‌పై ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి ఇదొక పిరియాడిక‌ల్ రొమాంటిక్ డ్రామా అని, పారిస్ నేప‌థ్యంలో దీన్ని తెర‌కెక్కిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆ ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేద‌ని ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌కుమార్ తేల్చేశారు.

ఇటీవ‌ల అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో నిర్మించిన భారీ సెట్‌లో ప్రారంభ‌మైన ఈ సినిమా అంతా అనుకున్న‌ట్టు పిరియాడిక్ డ్రామా కాద‌ని, ఇదొక కొత్త ప్ర‌పంచ‌మ‌ని, అదేంట‌న్న‌ది మాత్రం ప్ర‌స్తుతం స‌స్పెన్స్ అని అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టేశాడు. దీంతో అంతా అవాక్క‌వుతున్నారు. ప్ర‌భాస్ ఈ సినిమాతో ఆడియ‌న్స్‌కి స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారా? అని అంతా చ‌ర్చించుకుంటున్నారు. రాధాకృష్ణ‌కుమార్ చెబుతున్న కొత్త ప్ర‌పంచం ఏంటీ? ఎలా వుంటుంది అన్న‌ది తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.