సాహో రికార్డుల మోత మోగించడం ఖాయమా ?


Prabhas Eyes on Huge Openings

ప్రభాస్ నటించిన సాహో చిత్రం రికార్డుల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది . 350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సాహో ఆగస్టు 30 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే . ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు , ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు . దాంతో మొదటి రోజున అలాగే వీకెండ్ కలెక్షన్స్ లో రికార్డుల మోత మోగడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్ లలో విడుదల అవుతున్న సందర్బంగా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమైపోయింది . ఇక సినిమాకు టాక్ బాగుంటే అన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం . ఒకవేళ టాక్ బాగోలేకపోయినా ఓపెనింగ్ డే , వీకెండ్స్ రికార్డ్స్ సాహో వశం అవ్వడం ఖాయం . ఎందుకంటే క్రౌడ్ అంతగా ఉంది మరి ఈ సినిమా కోసం .