మా ఫ్యామిలీ కంటే మీడియానే ఆస‌క్తిగా వుంది!


మా ఫ్యామిలీ కంటే మీడియానే ఆస‌క్తిగా వుంది!
మా ఫ్యామిలీ కంటే మీడియానే ఆస‌క్తిగా వుంది!

గ‌త కొంత కాలంగా యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పెళ్లిపై వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. చివ‌రికి బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూస‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ క‌ర‌ణ్‌జోహార్ కూడా  త‌ను హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న `కాఫీ విత్ క‌ర‌ణ్‌`లోనూ ప్ర‌భాస్‌ని ప్రేమ పెళ్లిపై ప్ర‌శించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అక్క‌డితో ఆగ‌క ప్ర‌భాస్ పెళ్లిపై మ‌ళ్ఈ వ‌రుస క‌థ‌నాలు ఊపందుకున్నాయి.

భీమ‌వ‌రం అమ్మాయితో ప్ర‌భాస్ వివాహం జ‌ర‌గ‌బోతోంద‌ని కొన్ని రోజులు వార్త‌లు షికారు చేశాయి. ఆ త‌రువాత అనుష్క‌తో ప్రేమ‌లో వున్నార‌ని, వీరిద్ద‌రూ క‌లిసి పెళ్లిచేసుకుంటార‌ని మ‌రి కొన్ని రోజులు ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా ప్ర‌భాస్‌తో పెళ్లిపై మెగాడాట‌ర్ కొణిదెల నిహీరిక స్పందించ‌డంతో మ‌ళ్లీ ప్ర‌భాస్ వార్త‌ల్లో నిలిచారు.

తాజాగా ఈ వార్త‌ల‌న్నీ విన్నా ప్ర‌భాస్‌కి స్పందించాల‌ని అనిపించిందేమో తాజాగా స్పందించారు. 1నేను వివాహం విష‌యంలో విముఖంగా లేను. ఖ‌చ్చి‌తంగా చేసుకుంటాను. అయితే అది ఎప్పుడు జ‌రుగుతుంది అన్న‌ద మాత్రం ఖ‌చ్చితంగా చెప్ప‌లేను` అన్నారు. నా పెళ్లి విష‌యంలో మా ఫ్యామిలీ కంటే మీడియానే ఎక్కువ‌గా ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తోంది` అని సెటైర్ వేయ‌డం కొస‌మెరుపు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌కత్వంలో ఓ భారీ చిత్రం చేస్తున్నారు.