సాహో నష్టాలతో దిల్ రాజు వద్దకు ప్రభాస్prabhas dil raju
prabhas dil raju

ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో సినిమా ఫలితం దాదాపు తేలిపోయింది. ఒక్క హిందీలోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు చేరుకొని హిట్ అనిపించుకుంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కు రావాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సాహోకు అది దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

సాహోను నైజాం, ఉత్తరాంద్ర ప్రాంతాల్లో దిల్ రాజు పంపిణీ చేసాడు. ఈ రెండు ప్రాంతాల్లో దాదాపు 20 కోట్ల వరకూ నష్టాలని చవిచూడనున్నాడు దిల్ రాజు. మరోవైపు సాహో రిలీజ్ టైమ్ లో దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ కు చేసిన 10 కోట్ల సర్దుబాటు తిరిగి వెనక్కి ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ ను తన సొంత బ్యానర్ లా భావించే ప్రభాస్ నష్ట నివారణ చర్యలకు దిగాడు. తన డేట్స్ ను దిల్ రాజుకు ఇచ్చాడు.

ఇంకా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవ్వలేదు కానీ ఈ డీల్ ప్రభాస్, దిల్ రాజు ఇద్దరికీ ప్లస్ అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశాలున్నాయి.