మహేష్ ని వెనక్కి నెట్టిన ప్రభాస్


prabhas gets top place in times of india most desirable

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ని వెనక్కి నెట్టి రేసులో ముందుకు దూసుకుపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ . తాజాగా ప్రముఖ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా 2017మోస్ట్ డిజైరబుల్ లిస్ట్ ని విడుదల చేసింది . దేశ వ్యాప్తంగా పేరెన్నికగన్న ప్రముఖుల లిస్ట్ ని ప్రకటిస్తుంటుంది టైమ్స్ ఆఫ్ ఇండియా . అయితే ఆ లిస్ట్ లో ప్రభాస్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు . మొదటి స్థానంలో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ నిలవగా ప్రభాస్ రెండో స్థానం కొట్టేసాడు . ఇక మహేష్ బాబు మాత్రం ఆరవ స్థానంలో నిలిచాడు .

మహేష్ బాబు కు ఎనలేని క్రేజ్ ఉన్నప్పటికీ బ్రహ్మోత్సవం , స్పైడర్ చిత్రాలతో కాస్త వెనుకబడ్డాడు . ఇక ప్రభాస్ విషయానికి వస్తే …… బాహుబలి , బాహుబలి 2 చిత్రాలతో ఊహించని రీతిలో ప్రభాస్ ఇమేజ్ పెరిగింది . బాహుబలి పుణ్యమా అని ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది . ఆయా సెలబ్రిటీ లకున్న పాపులారిటీ , క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాంక్ లను ప్రకటించారు సదరు సంస్థ నిర్వాహకులు . అయితే తాజాగా భరత్ అనే నేను చిత్రంతో మహేష్ కు మళ్ళీ ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు .