ట్రైన‌ర్‌కు ఖ‌రీదైన గిఫ్ట్ ఇచ్చిన ప్ర‌భాస్‌!


ట్రైన‌ర్‌కు ఖ‌రీదైన గిఫ్ట్ ఇచ్చిన ప్ర‌భాస్‌!
ట్రైన‌ర్‌కు ఖ‌రీదైన గిఫ్ట్ ఇచ్చిన ప్ర‌భాస్‌!

మ‌లేషియాలో ఓడ్రైవ‌ర్ కార్‌ని ఫైనాన్స‌ర్‌లు లాక్కెళ్లార‌ని తెలిసి అదే త‌ర‌హా కారుని కొని అత‌నికి బ‌హుమ‌తిగా ఇచ్చింది అనుష్క‌. ఈ విష‌యం తెలిసి అంతా అవాక్క‌య్యారు. ఇదే త‌ర‌హాలో ప్ర‌భాస్ కూడా ఆశ్చ‌ర్యం క‌లిగించేలా ట్రైన‌ర్‌కు ఖ‌రీదైన కారుని గిఫ్ట్‌గా ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వివార‌ల్లోకి వెళితే..`బాహుబ‌లి` నుంచి ప్ర‌భాస్ ఫిట్‌నెస్ విష‌యంలో చాలా శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. హీమాన్ త‌ర‌హాలో క‌నిపించ‌డానికి ప్ర‌త్యేక ట్రైన‌ర్ స‌హ‌యంతో వ‌ర్క‌వుట్‌లు చేస్తున్నారు.

ప్ర‌భాస్ ‌ని ఫిట్‌గా త‌యారు చేస్తున్న ట్రైన‌ర్ ల‌క్ష్మ‌ణ్ రెడ్డి. అత‌నంటే ప్ర‌భాస్‌కు చాలా అభిమానం. ఆ అభిమానంతో అత‌నికి ఏకంగా ఖ‌రీదైన కారుని కానుక‌గా ఇచ్చారు. అయితే ఇది మామూలు కారు కాదు రేంజ్ రోవ‌ర్‌. ఇంత ఖ‌రీదైన గిఫ్ట్ ని ప్ర‌భాస్ త‌న ప‌ర్స‌న‌ల్‌ ట్రైన‌ర్‌కి ఇవ్వ‌డం ఇప్ప‌డు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్ర‌భాస్‌కు త‌న చుట్టూ వున్న వారికి స‌ర‌దాగా ఖ‌రీదైన గిఫ్ట్‌లు ఇవ్వ‌డం అల‌వాటు. అందుకే ఆయ‌న‌ని ప్రేమ‌గా డార్లింగ్ అని పిలుస్తుంటారు. ఇదే గుడ్ క్వాలిటీ ప్ర‌భాస్‌ని అశేష అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేస్తోంది. కోట్ల‌ల్లో అభిమానులు ఆయ‌న‌ని అభిమానించేలా చేస్తోంది. ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం `ఆది పురుష్‌` ఇందులోని మిగ‌తా పాత్ర‌ల్లో ఎవ‌రు న‌టిస్తారా అని టాలీవుడ్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది.