స‌మంత‌కు షాకిచ్చిన ప్ర‌భాస్‌?స‌మంత‌కు షాకిచ్చిన ప్ర‌భాస్‌?
స‌మంత‌కు షాకిచ్చిన ప్ర‌భాస్‌?

యంగ్ రెబ‌ల్ స్టార్ స్టార్ హీరోయిన్ స‌మంత‌కు షాకిచ్చారా? అంటే అవున‌నే స‌మాధాన‌రం వినిపిస్తోంది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం `రాధేశ్యామ్‌` మూవీ షూట్‌లో బిజీగా వున్నారు. త్వ‌ర‌లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కాబోతోంది. ఫిక్ష‌న‌ల్ పిరియాడిక్ ల‌వ్‌స్టోరీగా ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ త‌రువాత వెంట‌నే ప్ర‌భాస్ `ఆది పురు‌ష్‌` చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌బోతున్నారు.

ఓమ్ రౌత్ తెర‌కెక్కించ‌నున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇటీవ‌లే స్టార్ట‌యింది. ఈ మూవీ త‌రువాతే నాగ్ అశ్విన్ చిత్రాన్ని ప్ర‌భాస్ చేయ‌బోతున్నారు. వ‌రుస పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా వున్న ప్ర‌భాస్ డేట్స్ కోసం ఇప్ప‌టికీ స్టార్ ప్రొడ్యూస‌ర్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే ప్ర‌భాస్ స్టార్ హీరోయిన్ స‌మంత కు షాకిచ్చార‌ట‌. సామ్ ప్ర‌స్తుతం `ఆహా` కోసం `సామ్ జామ్‌` పేరుతో ఓ టాక్ షోని చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఇందులో పాల్గొన‌డానికి ప్ర‌భాస్ నిరాక‌రించిన‌ట్టు తెలుస్తోంది. `ఆహా` టీమ్ సంప్ర‌దించినా ప్ర‌భాస్ సున్నితంగా తిర‌స్క‌రించార‌ట‌. గ‌తంలో కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో ప్ర‌భాస్ పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో ప్ర‌భాస్‌, అనుష్క‌ల గురించి క‌ర‌ణ్ అడిగితే ప్ర‌భాస్ ఇబ్బంది ఫీల‌య్యారు. దాంతో టాక్ షోల‌కు దూరంగా వుండాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.