ఖైర‌తాబాద్‌లో ప్ర‌భాస్ హ‌ల్‌చ‌ల్‌!Prabhas hungama at khairatabad rta office
Prabhas hungama at khairatabad rta office

ఖైర‌తాబాద్‌లో ప్ర‌భాస్ హ‌ల్‌చ‌ల్ చేశారు. దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విళ‌య‌తాండ‌వం చేస్తున్న విష‌యం తెలిసిందే.  హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోనూ క‌రోనా ప్ర‌మ‌ద‌క‌ర స్థాయిలో విస్త‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో సామాన్య జ‌నం బ‌య‌టికి రావ‌డానికి భ‌యంతో వ‌ణికిపోతున్నారు. సెల‌బ్రిటీలు కూడా బ‌య‌ట అడుగు పెట్టాలంటే క‌రోనా కాటేసే ప్ర‌మాదం వుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు.

కానీ టాలీవుడ్ స్టార్ హీరో ప్ర‌భాస్ మాత్రం భ‌య‌ప‌డ‌టం లేదు. క‌రోనా జార్జియాలో ఉదృతంగా ప్ర‌బ‌లుతున్న వేళ అక్క‌డికి వెళ్లి `రాధూశ్యామ్‌` కోసం కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని తిరిగి వ‌చ్చి ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. తాజాగా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ఖైర‌తాబాద్‌లో సంద‌డి చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న ఇంట‌ర్నేష‌న‌ల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువ‌ల్ కోసం ఖైర‌తాబాద్ ఆర్టీలో కార్యాల‌యానికి వ‌చ్చిన ప్ర‌భాస్ సంద‌డి చేశారు.

బ్లూ ష‌ర్ట్‌, గ్రే పాంట్, ముఖానికి మాస్క్‌, గాగుల్స్ ధ‌రించిన ప్ర‌భాస్‌ని చూడ‌టానికి ఆర్టీఏ స్టాఫ్‌తో పాటు కార్యాల‌యానికి వ‌చ్చిన వారంతా ఎగ‌బ‌డ్డారు. స్టాఫ్‌తో పాటు సామాన్యులు, ప్ర‌భాస్ అభిమానులు ప్ర‌భాస్‌తో పోటోల‌కు పోటీప‌డ్డారు. ప్ర‌భాస్ కూడా వారికి స‌హ‌క‌రించ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంది.