ప్రభాస్ లుక్ మార్చాడు


prabhas in new look for radhakrishna movieయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సాహో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా పూర్తికాకుండానే మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం కూడా విదితమే ! గోపీచంద్ తో జిల్ వంటి సినిమాకు దర్శకత్వం వహించిన రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్రభాస్ బాహుబలి సమయంలోనే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే . సాహో చిత్రానికి మరో యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా అత్యంత భారీ బడ్జెట్ తో ఆ సినిమా రూపొందుతోంది .

ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం ఈనెల ఆఖరులో ప్రారంభం కానుంది . సెట్స్ మీదకు అయితే ఇప్పుడే వెళుతుంది కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం కాస్త గ్యాప్ చూసుకొని చేస్తారు . మొత్తానికి ఇప్పుడే ప్రారంభం అవుతున్నప్పటికీ ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది దసరా కు ఆ సినిమాని రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు . అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ లుక్ మార్చడమే కాకుండా లావు కూడా చాలా తగ్గాడు .