ప్రభాస్ తప్పు చేస్తున్నాడా


Prabhas in risk

బాహుబలి సిరీస్ లలో వచ్చిన రెండు చిత్రాలు కూడా టాలీవుడ్ చరిత్రని మాత్రమే కాదు బాలీవుడ్ చరిత్ర ని కూడా మార్చింది అలాంటి గొప్ప చిత్రాల తర్వాత ప్రభాస్ ఆ రేంజ్ లోనే సినిమా చేయాలి కానీ సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రాన్ని చేస్తున్నాడు అది ఒక ప్రయోగమనే చెప్పాలి ఎందుకంటే సుజిత్ యువ దర్శకుడు కాబట్టి , సరే ఆ సినిమాని పక్కన పెడితే మళ్ళీ రెండో సినిమా కూడా జిల్ వంటి ఫ్లాప్ చిత్రానికి దర్శకత్వం వహించిన రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే చిత్రం చేస్తున్నాడు ప్రభాస్ .

బాహుబలి , బాహుబలి 2 చిత్రాలు ప్రభంజనం సృష్టించాయి కాగా ఆ చిత్రాల తర్వాత ప్రభాస్ మళ్ళీ అగ్ర దర్శకులతో సినిమాలు చేయాల్సింది పోయి ప్రయోగాలూ చేస్తున్నాడని అది బెడిసి కొడితే రాజమౌళి సెంటిమెంట్ ని నిజం చేసిన వాడు అవుతాడు ప్రభాస్ . ఇంతకీ రాజమౌళి కి ఉన్న సెంటిమెంట్ ఏంటో తెలుసా …… రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోకు ఏనలేని ఇమేజ్ వస్తుంది కానీ ఆ సినిమా తర్వాత కోలుకోవాలంటే ఆ హీరోకు చాలా కాలం పడుతుంది . ఇప్పటివరకు జక్కన్న దర్శకత్వంలో నటించిన హీరోల అందరి పరిస్థితి ఇదే ! అంతెందుకు ఛత్రపతి సినిమా తర్వాత ప్రభాస్ కోలుకోవడానికి చాలా కాలం పట్టింది మరి . ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని నిజం చేస్తాడా ? లేక బ్రేక్ చేస్తాడా ? చూడాలి . కానీ ప్రభాస్ తప్పు చేస్తున్నాడేమో ! అని మాత్రం అంటున్నారు .